ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని హిందుస్థాన్ ఉర్వ్‌రక్ రసాయన్ లిమిటెడ్ హెచ్‌యూఆర్‌ఎల్ బరౌనీ యూనిట్‌లో వివిధ విభాగాల్లో టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
వివరాలు:
1. టెక్నికల్ అప్రెంటిస్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 02
2. టెక్నికల్ అప్రెంటిస్ ట్రైనీ (ఎలక్ట్రికల్)- 02
3. టెక్నికల్ అప్రెంటిస్ ట్రైనీ (కెమికల్)- 09
4. టెక్నికల్ అప్రెంటిస్ ట్రైనీ (సివిల్)- 02
5. టెక్నికల్ అప్రెంటిస్ ట్రైనీ (మెకానికల్)- 05
6. టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ- 13
అర్హత: టెక్నికల్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు బీఈ/బీటెక్, బీకాం/బీబీఏ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో బీఎస్సీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
జీతం: నెలకు టెక్నికల్ అప్రెంటిస్‌కు రూ.9,000; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 8,000.
వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ఎన్‌ఏటీఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: 20-12-2025.
Website:https://hurl.net.in/