హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం- 2025 విద్యా సంవత్సరానికి (జులై 2025 సెషన్) వివిధ సబ్జెక్టులు/ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (జులై 2025 సెషన్)
సబ్జెక్టులు: ఫిజిక్స్, ఇంగ్లిష్, హింది, తెలుగు, అప్లైడ్ లాంగ్వేజెస్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, అంత్రపాలజీ, ఎడ్యుకేషన్, రీజినల్ స్టడీస్, పోక్ కల్చర్ స్టడీస్ తదితరాలు.
అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష సెంటర్లు: హైదరాబాద్, భువనేశ్వర్, కొచ్చి, పట్న, దిల్లీ, గువహటి, కోల్‌కతా.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600; ఈడబ్ల్యూఎస్‌కు రూ.550; ఓబీసీకు రూ.400; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.275.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.04.2025.
హాటిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 15.05.2025.
ప్రవేశ పరీక్ష తేదీ: 31.05.2025, 01.06.2025.
ఇంటర్వ్యూ తేదీ: 30.06.2025- 03.07.2025.
Website: http://acad.uohyd.ac.in/