హైదరాబాద్‌లోని కాంచన్‌బాగ్ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 43
1. అసిస్టెంట్(ఫిట్టర్): 07
2. అసిస్టెంట్(ఎలక్ట్రీషియన్): 04
3. అసిస్టెంట్(టర్నర్): 01
4. అసిస్టెంట్(వెల్డర్): 02
5. అసిస్టెంట్ (మెటలర్జీ): 23
6. అసిస్టెంట్(మెకానికల్): 05
7. అసిస్టెంట్(సీఏడీ ఆపరేటర్): 01
అర్హతలు: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి అసిస్టెంట్(ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్)కు 33 ఏళ్లు, అసిస్టెంట్(మెటలర్జీ, మెకానికల్)కు 38 ఏళ్లు, అసిస్టెంట్(సీఏడీ ఆపరేటర్)కు 35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు అసిస్టెంట్(ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్)కు రూ.29,920, అసిస్టెంట్(మెటలర్జీ, మెకానికల్, సీఏడీ ఆపరేటర్)కు రూ.32,770.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 ఏప్రిల్ 25, 26, 28, మే 5, 6, 7.
వేదిక: మిధాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం, కాంచన్‌బాగ్, హైదరాబాద్-500058.
Website:https://midhani-india.in/department_hrd/career-at-midhani/