Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కింది విభాగాలు/ ట్రేడుల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అప్రెంటిస్: 300 ఖాళీలు
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, అటెండెంట్ ఆపరేటర్/ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), మోటార్ మెకానిక్స్(వెహికల్), డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానికల్), సీఓపీఏ, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్).
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. జనరల్ అభ్యర్థులకు 25 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050.
ఎంపిక విధానం: పదోతరగతి/ ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలక్ట్రీషియన్, వెల్డర్ ట్రేడులకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఎన్ఏపీఎస్ పోర్టర్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 25/11/2024.
Website:https://www.nfc.gov.in/