Published on Feb 20, 2025
Current Affairs
హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు
హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు

ప్రతిష్ఠాత్మక ప్రపంచ సుందరి (మిస్‌ వరల్డ్‌) పోటీలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. 2025, మే 4 నుంచి 31 వరకు జరిగే ఈ పోటీల్లో గ్రాండ్‌ ఫినాలే సహా ప్రారంభ, ముగింపు వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇతర ఈవెంట్లు జరగనున్నాయి. ఈ మేరకు పోటీల నిర్వాహకులు 2025, ఫిబ్రవరి 19న ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. మన దేశంలో ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలు గతంలో 1996, 2024లలో జరిగాయి.