హైడ్రోజన్‌తో నడిచే తొలి స్వదేశీ పడవను వారణాసిలో నమో ఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ 2025, డిసెంబరు 11న ఆవిష్కరించారు. అంతర్గత జల రవాణాలో ఇది కీలక ముందడుగు. దీని ప్రారంభంతో హైడ్రోజన్ శక్తితో పడవలు, ఓడలు నడుపుతున్న చైనా, నార్వే, నెదర్లాండ్స్, జపాన్ దేశాల సరసన భారత్ నిలిచింది.
ఈ నౌక పొడవు 24 మీటర్లు. ఏసీ క్యాబిన్ ఉంటుంది. దీనిలో 50 మంది ప్రయాణించవచ్చు.