- హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్ నియమితులయ్యారు. ఫోర్జరీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేసి.. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై అంబుడ్స్‌మన్ జస్టిస్ సురేశ్‌కుమార్ కైత్ వేటు వేశారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
- జగన్మోహన్‌రావును ఇంతకుముందే హెచ్‌సీఏ సస్పెండ్ చేయగా, ఉపాధ్యక్షుడు దల్జీత్‌సింగ్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.