హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) రాజస్థాన్ రాష్ట్రం ఖేత్రీ కాపర్ కాంప్లెక్స్‌లో చార్జ్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, డబ్ల్యూడీ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
వివరాలు:
చార్జ్‌మ్యాన్ (ఎలక్ట్రికల్): 04
ఎలక్ట్రీషియన్ ‘ఏ’: 02
ఎలక్ట్రీషియన్ ‘బి’: 03
డబ్ల్యూడీ ‘బి’: 04
డబ్ల్యూడీ ‘సి’: 05
అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేట్ (బీఏ/బీఎస్సీ/బీకాం) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవంఉండాలి.
జీతం: నెలకు చార్జ్‌మ్యాన్‌కు రూ.28,740- రూ.72,110; ఎలక్ట్రీషియన్ ‘ఏ’కు రూ.28,430- రూ.59,700; ఎలక్ట్రీషియన్ ‘బి’, డబ్ల్యూడీ ‘బి’కు రూ.28,280- రూ.57,640; డబ్ల్యూడీ ‘సి’కు రూ.28,120- రూ.55,620.
వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఎబిలిటీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-02-2026.
Website: https://www.hindustancopper.com/