Published on Oct 1, 2024
Government Jobs
హెచ్‌యూఆర్‌ఎల్‌లో గ్రాడ్యుయేట్/డిప్లొమా ఇంజినీర్ ట్రెనీలు
హెచ్‌యూఆర్‌ఎల్‌లో గ్రాడ్యుయేట్/డిప్లొమా ఇంజినీర్ ట్రెనీలు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఐఓసీఎల్‌), ఎన్‌టీపీసీ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ), కోల్‌ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌)ల జాయింట్‌ వెంచర్‌ ఝార్ఖండ్‌ రాష్ట్రం సింద్రీలోని హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్ (హెచ్‌యూఆర్ఎల్‌) గ్రాడ్యుయేట్/డిప్లొమా ఇంజినీర్ ట్రైనీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 212

వివ‌రాలు:

1. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ: 67

2. డిప్లొమా ఇంజినీర్ ట్రైనీ: 145

విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ ఇంజినీర్‌ ట్రైనీలకు రూ.40,000; డిప్లొమా ఇంజినీర్ ట్రైనీలకు రూ.23,000.

వయోపరిమితి: జీఈటీలకు 30 ఏళ్లు; డీఈటీలకు 27 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జీఈటీలకు రూ.750; డీఈటీలకు రూ.500.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 21-10-2024.

Website:https://hurl.net.in/