Published on Feb 4, 2025
Government Jobs
హెచ్‌పీసీఎల్-రాజస్థాన్‌ రిఫైనరీలో ఖాళీలు
హెచ్‌పీసీఎల్-రాజస్థాన్‌ రిఫైనరీలో ఖాళీలు

హెచ్‌పీసీఎల్ - రాజస్థాన్‌ రిఫైనరీ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌ఆర్‌ఎల్‌) ఇంజినీర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 121

వివరాలు:

1. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(కెమికల్‌): 80 

2. ఇంజినీర్‌(ఇనుస్ట్రుమెంటేషన్‌): 03

3. ఇంజినీర్‌(ఎలక్ట్రికల్): 03

4. ఆఫీసర్‌-ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌: 01

5. సీనియర్‌ ఇంజినీర్‌-ప్రాసెస్‌: 11

6. సీనియర్‌ మేనేజర్‌- ప్రాసెస్‌: 04

7. సీనియర్ మేనేజర్‌- ప్రాసెస్‌: 03

8. సీనియర్‌ మేనేజర్‌- టెక్నికల్ ప్లానింగ్‌: 01

9. సీనియర్‌ మేనేజర్‌- సేఫ్టీ: 01

10. సీనియర్‌ మేనేజర్‌- క్వాలిటీ కంట్రోల్: 01

11. సీనియర్‌ మేనేజర్‌- మెకానికల్: 08

12. సీనియర్‌ మేనేజర్‌- ఇనుస్ట్రుమెంటేషన్‌: 03

13. సీనియర్‌ మేనేజర్‌- ఫైర్ అండ్ సేఫ్టీ: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా( కెమికల్‌, ప్లాస్టిక్‌, పాలిమర్‌), బీఎస్సీ(కెమిస్ట్రీ), బీఈ, బీటెక్‌(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌)లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(కెమికల్‌)కు 25 ఏళ్లు, సీనియర్‌ ఇంజినీర్‌-ప్రాసెస్‌కు 34 ఏళ్లు, ఇంజినీర్‌(ఇనుస్ట్రుమెంటేషన్‌), ఇంజినీర్‌(ఎలక్ట్రికల్), ఆఫీసర్‌-ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌కు 29 ఏళ్లు, మిగతా పోస్టులకు 42 ఏళ్లు.

జీతం: నెలకు జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(కెమికల్‌)కు రూ.30,000 - రూ.1,20,000, ఇంజినీర్‌(ఇనుస్ట్రుమెంటేషన్‌), ఇంజినీర్‌(ఎలక్ట్రికల్), ఆఫీసర్‌-ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ పోస్టులకు రూ.50,000 - రూ. 1,60,000, సీనియర్‌ ఇంజినీర్‌-ప్రాసెస్‌కు రూ.60,000 - రూ.1,80,000, మిగతా పోస్టులకు రూ.80,000 - రూ.2,20,000.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1180, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 08-02-2025. 

Website:https://hrrl.in/Hrrl/current-openings.jsp