ముంబయిలోని హెచ్‌పీసీఎల్-ఎల్ఎన్‌జీ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్-ఎల్ఎన్‌జీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 35
వివరాలు:
1. గ్రూప్ మేనేజర్(ఫైర్): 01
2. సీనియర్ ఆఫీసర్(ఫైర్): 04
3. గ్రూప్ మేనేజర్(సెక్యురిటీ): 01
4. మేనేజర్(ఆపరేషన్): 01
5. కంట్రోల్ రూమ్ ఆఫీసర్: 04
6. ఫీల్డ్ ఆపరేటర్: 16
7. మేనేజర్(ఎలక్ట్రికల్): 01
8. సీనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్: 03
9. సీనియర్ ఇంజినీర్(మెకానికల్): 01
10. మేనేజర్(ఇనుస్ట్రుమెంటేషన్): 01
11. సీనియర్ ఇంజినీర్(సివిల్): 01
12. సీనియర్ ఆఫీసర్(మెటీరియల్స్): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ(కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, ఫైర్, సివిల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గ్రూప్ మేనేజర్‌కు 34 ఏళ్లు, మేనేజర్(ఇనుస్ట్రుమెంటేషన్, ఆపరేషన్, ఎలక్ట్రికల్)కు 30 ఏళ్లు, సీనియర్ ఆఫీసర్(ఫైర్), సీనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, మెటీరియల్స్)కు 27 ఏళ్లు, కంట్రోల్ రూమ్ ఆఫీసర్‌కు 26 ఏళ్లు, ఫీల్డ్ ఆపరేటర్‌కు 25 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు గ్రూప్ మేనేజర్‌కు రూ.60,000 - రూ.1,80,000, మేనేజర్-ఆపరేషన్‌కు రూ.50,000 - రూ.1,40,000, సీనియర్ ఆఫీసర్(ఫైర్), సీనియర్ ఇంజినీర్(మెకానికల్, సివిల్, మెటీరియల్స్)కు రూ. 40,000 - రూ.1,80,000, కంట్రోల్ రూమ్ ఆఫీసర్‌కు రూ.30,900 - రూ.1,20,000, ఫీల్డ్ ఆఫరేటర్‌కు రూ.30,000 - రూ.1,20,000.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 02-03-2025.
Website: https://www.hplng.in/careers.html