ముంబయిలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), రిఫైనరీస్ విభాగంలో వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 103
వివరాలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ - మెకానికల్: 11
జూనియర్ ఎగ్జిక్యూటివ్ - ఎలక్ట్రికల్: 17
జూనియర్ ఎగ్జిక్యూటివ్ - ఇన్‌స్ట్రుమెంటేషన్: 6
జూనియర్ ఎగ్జిక్యూటివ్ - కెమికల్: 41
జూనియర్ ఎగ్జిక్యూటివ్ - ఫైర్ & సేఫ్టీ: 28
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ లేదా ఫైర్ & సేఫ్టీ) 3 ఏళ్ల డిప్లొమా, సైన్స్ విభాగంలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ ఎన్‌సీ వారికి 3 ఏళ్లు; పీడబ్ల్యూబీడీ వారికి 15 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.30,000 - రూ.1,20,000.
దరఖాస్తు ఫీజు: రూ.1180; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు పీజు లేదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ డిస్కషన్/టాస్క్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.05.2025.
Website:https://hindustanpetroleum.com/