Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 26, 2026
Government Jobs
హెచ్‌పీసీఎల్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌/ఇంజినీర్‌ ఉద్యోగాలు
హెచ్‌పీసీఎల్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌/ఇంజినీర్‌ ఉద్యోగాలు

మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( హెచ్‌పీసీఎల్‌), 2025-26 సంవత్సరానికి వివిధ విభాగాలలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

వివరాలు:

జూనియర్ ఎగ్జిక్యూటివ్‌/ఇంజినీర్‌/ఆఫీసర్: 732

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 25 నుంచి 45 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు పోస్టులను అనుసరించి రూ.30,000 - రూ.2,80,000.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు ఫైనాన్స్, హెచ్‌ఆర్, క్వాలిటీ కంట్రోల్, ఫైర్ అండ్ సేఫ్టీ వంటి విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ & ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఫ్రెషర్స్ కోసం: మెకానికల్ ఇంజనీర్ (72), ఎలక్ట్రికల్ ఇంజనీర్ (37), సివిల్ ఇంజనీర్ (17), కెమికల్ ఇంజనీర్ (15) వంటి పోస్టులు ఉన్నాయి. వీటికి గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లుగా నిర్ణయించారు.

అనుభవం ఉన్నవారి కోసం: సీబీజీ ఆపరేషన్స్, సేఫ్టీ, సేల్స్, లా, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి పోస్టులు ఉన్నాయి.

ఎంపిక ప్రక్రియ: 

అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్ & పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షను తాత్కాలికంగా మే 3, 2026న నిర్వహించనున్నారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఇతరులకు ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ: 25 మార్చి 2026 (రాత్రి 11:59 గంటల వరకు).

Website:https://www.hindustanpetroleum.com/job-openings