Published on Jan 4, 2025
Apprenticeship
హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ పోస్టులు

మహారాష్ట్ర, ముంబయిలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 2025 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ, సివిల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇనుస్ట్రుమెంటేషన్, పెట్రోలియం ఇంజినీరింగ్.

అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.25,000.

ఎంపిక విధానం: విద్యార్హత, షార్ట్‌లిస్ట్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-01-2025.

Website:https://www.hindustanpetroleum.com/