పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ సంస్థ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), 2026-27 సంవత్సరానికి ఇంజినీరింగ్ విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్ స్ట్రీమ్): 250 ఖాళీలు
(ముంబయి రిఫైనరీ-మహారాష్ట్ర- 120; విశాఖ రిఫైనరీ- ఆంధ్రప్రదేశ్- 130)
అప్రెంటిస్‌షిప్ వ్యవధి: 1 సంవత్సరం
అర్హత: అభ్యర్థులు కనీసం 60% (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ50%) మార్కులతో సంబంధిత విభాగాలలో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ) ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 10-03-2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. (సడలింపు: ఎస్సీ/ఎస్టీలకు 5; ఓబీసీలకు 3; పీడబ్ల్యూబీడీ 10 సంవత్సరాలు).
జీతం/స్టైపెండ్: నెలకు రూ.25,000.
ఎంపిక విధానం: మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
అప్రెంటిస్‌షిప్ శిక్షణ బోర్డు (BOAT) ద్వారా ఎన్‌ఏటీఎస్ (NATS 2.0) పోర్టల్‌లో, హెచ్‌పీసీఎల్ అప్రెంటిస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: 10.03.2026.