Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 21, 2026
Apprenticeship
హెచ్‌పీసీఎల్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టులు
హెచ్‌పీసీఎల్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌), 2026-27 సంవత్సరానికి దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

మొత్తం గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు: 608

విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్.

అర్హత: సంబంధిత విభాగాల్లో 60% మార్కులతో (SC/ST/PwBD అభ్యర్థులకు 50%) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు 01-04-2023 తర్వాత ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.

వయోపరిమితి: 02-03-2026 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ-ఎన్‌సీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.

స్టైపెండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

రాష్ట్రాల వారీగా ఖాళీలు (తెలుగు రాష్ట్రాల్లో): మొత్తం ఖాళీలలో ఆంధ్రప్రదేశ్‌లో 62, తెలంగాణలో 22 స్థానాలు అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 114 ఖాళీలు ఉన్నాయి.

ఎంపిక విధానం: అభ్యర్థుల మెరిట్ మార్కుల ఆధారంగా స్క్రీనింగ్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం 1:5 నిష్పత్తిలో పిలుస్తారు. తుది ఎంపిక మెరిట్ జాబితా, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా NATS 2.0 పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అనంతరం హెచ్‌పీసీఎల్‌ అధికారిక పోర్టల్‌ (http://jobs.hpcl.co.in/Recruit_New/recruitlogin.jsp) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభం: 16-02-2026.

చివరి తేదీ: 02-03-2026.

Website:https://www.hindustanpetroleum.com/job-openings