Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 2, 2026
Current Affairs
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని 2026, ఫిబ్రవరి 28న రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా హ్యూమన్‌ ప్యాపిలోమావైరస్‌(హెచ్‌పీవీ)ని ఇది అరికడుతుంది. ఇందులోభాగంగా 14 సంవత్సరాల బాలికలకు సింగిల్‌ డోస్‌ ‘గార్డాసిల్‌-4’ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ హెచ్‌పీవీ టైప్‌ 16, 18తో పాటు టైప్‌ 6, 11 రకాల నుంచి రక్షణ కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది.