Published on Apr 23, 2025
Current Affairs
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

దేశంలో రూ.15 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ సాధించిన మూడో సంస్థగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిలిచింది.

ఇంతకుముందు రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఈ ఘనత సాధించాయి. 2025, ఏప్రిల్‌ 22న ఇంట్రాడేలో రూ.1970.65 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు, చివరకు 1.78% లాభపడి రూ.1,961.90 వద్ద ముగిసింది.

ఏప్రిల్‌ 9 నుంచి ఈ షేరు 11.12% పెరగడంతో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ ఇప్పటికి రూ.1.50 లక్షల కోట్లు పెరిగి రూ.15.01 లక్షల కోట్లకు చేరింది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.17.46 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో అగ్రస్థానంలో ఉండగా, టీసీఎస్‌ (రూ.12 లక్షల కోట్లు) 3వ స్థానంలో ఉంది.