Published on Jan 9, 2026
Apprenticeship
హెచ్‌ఓసీఎల్‌లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు
హెచ్‌ఓసీఎల్‌లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు

కేరళలోని హిందుస్థాన్‌ ఆర్గానిక్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఓసీఎల్‌) ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ నుంచి అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 20

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (బీఈ/బీటెక్‌ డిగ్రీ అభ్యర్థులు): 04 ఖాళీలు

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ (డిప్లొమా అభ్యర్థులు): 16

విభాగాలు: ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, మెకానికల్, సివిల్‌, కెమికల్‌, కమర్షియల్‌ ప్రాక్టీస్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌.

అర్హతలు: సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 01.01.2026 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఎన్‌ఏటీ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: 20.01.2026.

Website:https://www.hoclindia.com/lang/en