రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్ ), హైదరాబాద్‌లోని తన 'ఇండస్ట్రియల్ హెల్త్ సెంటర్' కోసం పార్ట్-టైమ్ ప్రాతిపదికన విజిటింగ్ డాక్టర్ల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
విజిటింగ్ డాక్టర్స్: 05
అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) కలిగి ఉండాలి. పోస్టును బట్టి కనీసం 2 నుంచి 5 ఏళ్ల వరకు క్లినికల్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: మార్చి 31, 2026 నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 65 ఏళ్లలోపు ఉండాలి.
పనివేళలు & వేతనం: విజిటింగ్ డాక్టర్లు వారానికి నిర్దేశించిన రోజులు (1 నుంచి 3 రోజులు) & గంటల పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. గంటకు రూ.600 నుంచి రూ.2,500 వరకు గౌరవ వేతనంతో పాటు కన్వేయన్స్ ఛార్జీలు చెల్లిస్తారు.
నియామక కాలం: ఈ నియామకాలు ప్రారంభంలో రెండేళ్ల కాలానికి ఉంటాయి. అవసరాన్ని బట్టి మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం: కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారిని వారి విద్యార్హతలు & అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత గల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను 'Chief Manager (HR), HR Department, Avionics Division, Post-HAL, Hyderabad-500042' చిరునామాకు పంపాలి.
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 31.03.2026.
Website: https://hal-india.co.in/home