Published on Nov 8, 2024
Government Jobs
హెచ్‌ఏఎల్‌, హైదరాబాద్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
హెచ్‌ఏఎల్‌, హైదరాబాద్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

హైదరాబాద్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌), ఏవియానిక్స్ డివిజన్ నాలుగేళ్ల ఒప్పంద ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో డిప్లొమా టెక్నీషియన్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 57

వివరాలు:

1. డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్): 10 పోస్టులు

2. డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్): 05 పోస్టులు

3. డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్): 35 పోస్టులు

4. డిప్లొమా టెక్నీషియన్ (కెమికల్): 01 పోస్టు

5. ఆపరేటర్ (ఎలక్ట్రానిక్ మెకానిక్): 02 పోస్టులు

6. ఆపరేటర్ (ఫిట్టర్): 01 పోస్టు

7. ఆపరేటర్ (పెయింటర్): 02 పోస్టులు

8. ఆపరేటర్ (టర్నర్): 01 పోస్టు

అర్హత: ఆపరేటర్ పోస్టులకు సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా టెక్నీషియన్ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిప్లొమా, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయో పరిమితి: 24-11-2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

బేసిక్ పే: నెలకు డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు రూ.23000. ఆపరేటర్ పోస్టులకు రూ.22000.. ఆ తర్వాత పెరుగుతుంది.

పోస్టింగ్ ప్లేస్‌: హైదరాబాద్, శ్రీనగర్, సిర్సా, భటిండా, బరేలీ, గోరఖ్‌పూర్, గ్వాలియర్, తేజ్‌పూర్, చబువా, బగ్‌డోగ్రా, హసిమారా, కలైకుండ, బీదర్, పుణె, భుజ్, జామ్‌నగర్, జోధ్‌పుర్, ఉత్తరలై, మామున్, మిస్సమారి, గోవా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 24-11-2024.

రాత పరీక్ష తేదీ: 22-12-2024.

Website:https://hal-india.co.in/home

Apply online:https://hal-v1.exmegov.com/#/index