హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) వివిధ విభాగాల్లో డిప్లొమా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 16
వివరాలు:
1. డిప్లొమా టెక్నీషియన్(మెకానికల్): 01
2. డిప్లొమా టెక్నీషియన్(ఎలక్ట్రికల్): 02
3. డిప్లొమా టెక్నీషియన్(ఎలక్ట్రానిక్స్): 13
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 మే 7వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.23,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 7.
పరీక్ష తేదీ: 2025 మే 25.
Website:https://hal-india.co.in/home