Published on Nov 30, 2024
Government Jobs
హెచ్‌ఏఎల్‌, నాసిక్‌లో వివిధ పోస్టులు
హెచ్‌ఏఎల్‌, నాసిక్‌లో వివిధ పోస్టులు

నాసిక్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌), ఎయిర్‌క్రాఫ్ట్ డివిజన్ నాలుగేళ్ల ఒప్పంద ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 57

వివరాలు:

1. డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్): 10 పోస్టులు

2. డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్): 05 పోస్టులు

3. డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్): 35 పోస్టులు

4. డిప్లొమా టెక్నీషియన్ (కెమికల్): 01 పోస్టు

5. ఆపరేటర్ (ఎలక్ట్రానిక్ మెకానిక్): 02 పోస్టులు

6. ఆపరేటర్ (ఫిట్టర్): 01 పోస్టు

7. ఆపరేటర్ (పెయింటర్): 02 పోస్టులు

8. ఆపరేటర్ (టర్నర్): 01 పోస్టు

అర్హత: పెయింటర్/ టర్నర్ విభాగాలకు పదో తరగతి, ఐటీఐ (ఫిట్టర్/ ఎలక్ట్రీషియన్), మిగిలిన విభాగాలకు డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయో పరిమితి: 21-11-2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

బేసిక్ పే: నెలకు డిప్లొమా ఆపరేటర్ పోస్టులకు రూ.23000. ఐటీఐ ఆపరేటర్ పోస్టులకు రూ.22000.. ఆ తర్వాత పెరుగుతుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 09-12-2024.

రాత పరీక్ష తేదీ: 22-12-2024.

Website:https://hal-india.co.in/home

Apply online:https://www.hal-india.co.in/career-details