Published on Aug 30, 2024
Walkins
హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు
హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మహారాష్ట్రలో ఉన్న హెచ్‌ఎల్‌ఎల్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1,121.

వివరాలు:

1. సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్: 357 పోస్టులు

2. డయాలసిస్ టెక్నీషియన్: 282 పోస్టులు

3. జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్: 264 పోస్టులు

4. అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్: 218 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ కోర్సు/ డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి:  01.08.2024 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు. 

జీతం: నెలకు అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.24,219. జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.29,808. డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.35,397. సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.53,096.

దరఖాస్తు విధానం: వాక్-ఇన్-సెలక్షన్‌కు హాజరు కాలేని అభ్యర్థులు తమ సీవీని hrhincare@lifecarehll.com కు 07.09.2024 లోగా ఈమెయిల్‌ చేయాలి.

వాక్ ఇన్ సెలక్షన్‌ తేదీలు: 04, 05.09.2024.

వేదిక: పుణె, నాగ్‌పుర్, నాసిక్, షోలాపూర్, నాందేడ్, నవీ ముంబయి, అమరావతి, ఔరంగాబాద్, కొల్హాపూర్, లాతూర్.

Website:https://www.lifecarehll.com/