Published on Jan 10, 2026
Apprenticeship
హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో ఎంబీఏ, గ్రాడ్యుయేట్‌ ట్రైనీ పోస్టులు
హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో ఎంబీఏ, గ్రాడ్యుయేట్‌ ట్రైనీ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఎంబీఏ, గ్రాడ్యుయేట్‌, ఐటీఐ ట్రేడ్‌ ట్రైనీ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11

వివరాలు: 

ఎంబీఏ ట్రైనీ అప్రెంటిస్‌: 01

గ్రాడ్యుయేట్‌ ట్రైనీ: 05

ఐటీఐ ట్రైనీ: 05

అర్హత: సంబంధిత విభాగం/ట్రేడుల్లో ఎంబీఏ, బీఎస్సీ, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు ఎంబీఏ ట్రైనీలకు మొదటి ఏడాది రూ.11,500, రెండో ఏడాది రూ.13,000, మూడో ఏడాది రూ.15,000; గ్రాడ్యుయేట్‌ ట్రైనీలకు మొదటి ఏడాది రూ.10,000, రెండో ఏడాది రూ.11,000, మూడో ఏడాది రూ.12,500; ఐటీఐ ట్రీనీలకు మొదటి ఏడాది రూ.9,500, రెండో ఏడాది రూ.10,500, మూడో ఏడాది రూ.12,000.

దరఖాస్తు విధానం: జనరల్‌ మేనేజర్‌ ఆపరేషన్స్‌ అండ్‌ యూనిట్‌ చీఫ్‌, హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌, కర్ణాటక.

దరఖాస్తు చివరి తేదీ: 23-01-2026.

Website:https://www.lifecarehll.com/careers/view/reference/5705e1164a8394aace6018e27d20d237jIiJ