Published on Feb 10, 2025
Government Jobs
హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూలో వివిధ పోస్టులు
హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూలో వివిధ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌, హెల్త్‌ మెడికల్‌ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ (హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూ), తిరుపతి ఒప్పంద /ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

మొత్తం పోస్టులు: 66

వివరాలు:

1. ల్యాబ్‌ అటెండెంట్: 07

2. జనరల్‌ డ్యూటీ అంటెండెంట్: 15

3. లైబ్రేరీ అటెండెంట్: 01

4. టెక్నీషియన్‌: 13

5. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 03

6. నర్సింగ్‌ ఆర్డర్లీ (ఫిమేల్‌ /మేల్‌): 17

7. ఆపరేషన్ థియేటర్‌ అసిస్టెంట్: 02

8. ఎలక్ట్రీషియన్‌/ మెకానిక్‌: 01

9. అటెండర్లు: 04

10. ఫిజియోథెరపిస్ట్‌: 02

11. మార్చురీ మెకానిక్‌: 01

విభాగాలు: ఓటీ, సీ - ఆర్మ్‌, డయాలసిస్‌, అనస్థీషియా, ఎమర్జెన్సీ మెడికల్‌, ఈఈజీ, ఆడియోమెట్రీ తదితరాలు.

అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, బీఎస్సీ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: పోస్టును బట్టి నెలకు రూ.15,000-రూ.32,670.

పని ప్రదేశాలు: ఎంపికైన అభ్యర్థులు తిరుపతిలోని ఎస్‌వీ మెడికల్ కాలేజ్‌, ఎస్‌వీఆర్‌ఆర్‌ గవర్నమెంట్‌ హస్పిటల్‌, గవర్నమెంట్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, ఎస్‌వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, శ్రీ పద్మావతి గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, గవర్నమెంట్‌ మెటర్నిటీ హస్పిటల్‌లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 22-02-2025.

ప్రొవిజన్ మెరిట్ జాబితా తేదీ: 07-03-2025.

అభ్యంతరాల చివరి తేదీ: 12-03-2025.

తుది మెరిట్ జాబితా: 15-03-2025.

ధ్రువపత్రాల పరిశీలన, నియామక ఉత్తర్వులు: 24-03-2025.

Website:https://tirupati.ap.gov.in/