1975 మార్చి 15న భారత హాకీ జట్టు ప్రపంచకప్ విజేతగా నిలిచింది. దేశానికి దక్కిన ఏకైక ప్రపంచకప్ అది.
ఒలింపిక్స్‌లో తిరుగులేని ఆధిపత్యంతో భారత హాకీ జట్టు అప్పటికే ఏడు స్వర్ణాలు సాధించింది.
1971 ప్రపంచకప్ మొదలైనపుడు భారత జట్టు కాంస్యం నెగ్గింది, 1973లో రజతం సాధించింది. 1975లో అజిత్‌పాల్ సింగ్ నేతృత్వంలోని జట్టు స్వర్ణం నెగ్గింది.
తర్వాత ఇంకెప్పుడూ భారత్‌కు కప్పు దక్కలేదు. ఈ అద్భుత విజయానికి 2025, మార్చి 15తో 50 ఏళ్లు పూర్తయ్యింది.