ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ హాకీలో పాల్గొనే భారత మహిళల జట్టుకు వందన కటారియా సారథ్యం వహించనుంది. ఫిబ్రవరి 15న భువనేశ్వర్‌లో ప్రారంభమయ్యే లీగ్ కోసం 24 మంది క్రీడాకారిణులతో 2025, జనవరి 29న భారత జట్టును ప్రకటించారు. భారత్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ బరిలో దిగే ఈ లీగ్‌లో ఒక్కో జట్టు రెండేసి మార్లు తలపడతాయి.
భారత జట్టు:
గోల్ కీపర్లు: సవిత, బిచు దేవి; డిఫెండర్లు: సుశీల చాను, నిక్కి ప్రధాన్, ఉదిత, జ్యోతి, ఇషిక చౌదరి, జ్యోతి ఛత్రి; మిడ్ ఫీల్డర్లు: వైష్ణవి ఫాల్కే, నేహా, మనీషా చౌహాన్, సలీమా టెటె, సునెలిత తోపో, లాల్రెంసియామి, బల్జీత్ కౌర్, షర్మిల దేవి; ఫార్వర్డ్‌లు: నవనీత్ కౌర్, ముంతాజ్ ఖాన్, ప్రీతి దూబె, రుతుజ పిసల్, బ్యూటీ డుంగ్‌డుంగ్, సంగీత కుమారి, దీపిక, వందన కటారియా.