Published on Mar 17, 2025
Current Affairs
హాకీ ఇండియా పురస్కారాలు
హాకీ ఇండియా పురస్కారాలు

భారత హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్, మహిళల టీమ్‌ సీనియర్‌ గోల్‌కీపర్‌ సవిత పునియాలకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఉత్తమ ప్లేయర్‌ (2024) అవార్డులు దక్కాయి.

సవిత బెస్ట్‌ గోల్‌కీపర్‌గా కూడా ఎంపికైంది. 2024లో జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో జట్టు కాంస్యం గెలవడంలో హర్మన్‌ప్రీత్‌ కీలకపాత్ర పోషించాడు.

2020 టోక్యో ఒలింపిక్స్‌ భారత మహిళల జట్టులో సవిత సభ్యురాలు. జట్టు కాంస్య పోరు వరకు వెళ్లడంలో ఈ గోల్‌కీపర్‌ పాత్ర కీలకం. ఈ పురస్కారం దక్కడం సవితకు ఇది మూడోసారి. 

భారత్‌ హాకీ వందేళ్లు పూర్తి చేసుకోవడం, ప్రపంచకప్‌ నెగ్గి 50 ఏళ్లు గడిచిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ హాకీ ఇండియా వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు.