Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 14, 2026
Current Affairs
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌ 2026, మార్చి 13న ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ఆమెతో ప్రమాణం చేయించారు. జస్టిస్‌ లిసా గిల్‌ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.

ప్రస్తుత సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ 2026 ఏప్రిల్‌ 24న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం జస్టిస్‌ లిసా గిల్‌ సీజేగా నియమితులుకానున్నారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డులకెక్కనున్నారు.