Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 28, 2026
Current Affairs
హాకీకి గుర్జంత్‌ వీడ్కోలు
హాకీకి గుర్జంత్‌ వీడ్కోలు
  • రెండుసార్లు ఒలింపిక్‌ పతకం గెలిచిన భారత హాకీ జట్టులో సభ్యుడైన గుర్జంత్‌ సింగ్‌ (31 ఏళ్లు) 2026, మార్చి 27న ఆటకు వీడ్కోలు పలికాడు. 2025లో వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైన గుర్జంత్‌.. తర్వాత మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. 2017లో అరంగేట్రం చేసిన ఈ ఫార్వర్డ్‌.. 130 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 33 గోల్స్‌ కొట్టాడు. 
  • 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్‌ స్వర్ణం గెలవడంలో కీలకపాత్ర పోషించిన గుర్జంత్‌.. 2020 టోక్యో, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు గెలిచిన జట్లలో ఉన్నాడు.