Published on Oct 29, 2024
Current Affairs
సి-295 విమానాల ఉత్పత్తి కర్మాగార ప్రారంభం
సి-295 విమానాల ఉత్పత్తి కర్మాగార ప్రారంభం

దేశంలో సి-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కోసం గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటైన కర్మాగారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్పెయిన్‌ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్‌తో కలిసి 2024, అక్టోబరు 28న ప్రారంభించారు.

ఇలాంటి కర్మాగారం ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు కావడం మన దేశంలో ఇదే తొలిసారి. టాటా అడ్వాన్స్డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌కు చెందిన ఈ కర్మాగారానికి 2022 అక్టోబరులో మోదీ శంకుస్థాపన చేశారు. 

సి-295కు సంబంధించిన భాగాల ఉత్పత్తి హైదరాబాద్‌లోని ‘మెయిన్‌ కన్‌స్టిట్యూయెంట్‌ అసెంబ్లీ’లో ఇప్పటికే ప్రారంభమైంది. వీటిని వడోదర యూనిట్‌కు రవాణా చేస్తారు. ఈ భాగాల తుది కూర్పు అక్కడే జరుగుతుంది.