Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
పుణెలోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-మెట్) తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
వివరాలు:
1. రిసెర్చ్ అసోసియేట్: 02
2. ప్రాజెక్ట్ అసోసియేట్-1: 03
3. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 03
4. ప్రాజెక్ట్ క్లర్క్/ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 01
5. బిజినెస్ కన్సల్టెంట్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ( సైన్స్/ ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఈ/బీటెక్ (కెమికల్/ మెకానికల్), ఎంబీఏ (బిజినెస్ డెవలప్మెంట్/ మార్కెటింగ్), ఎంఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ క్లర్క్ పోస్టులకు 35 ఏళ్లు; ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 28 ఏళ్లు; బిజినెస్ కన్సల్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు రూ.58,000; ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ.31,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ క్లర్క్ పోస్టులకు రూ.20,000; బిజినెస్ కన్సల్టెంట్ పోస్టులకు రూ.1,50,000.
దరఖాస్తు ఫీజు: రూ.50; ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 22-11-2024.
వేదిక: సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-మెట్), పంచవటి, పాశాన్ రోడ్ ఎదురుగా, పుణె.
Website:https://cmet.gov.in/jobs