Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.

Published on Nov 14, 2024
Walkins
సీ-మెట్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీ-మెట్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు

పుణెలోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-మెట్‌) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 07

వివ‌రాలు:

1. జూనియర్ రిసెర్చ్ ఫెలో/ ప్రాజెక్ట్ అసోసియేట్: 04

2. ప్రాజెక్ట్ క్లర్క్/ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 02

3. బిజినెస్ కన్సల్టెంట్: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ( సైన్స్/ ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఈ/బీటెక్ (కెమికల్/ మెకానికల్), ఎంబీఏ (బిజినెస్‌ డెవలప్‌మెంట్/ మార్కెటింగ్), ఎంఎస్సీ (ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్ క్లర్క్ పోస్టులకు 35 ఏళ్లు; బిజినెస్ కన్సల్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు. 

జీతం: నెలకు జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు రూ.46,990; ప్రాజెక్ట్ క్లర్క్ పోస్టులకు రూ.20,000; బిజినెస్ కన్సల్టెంట్ పోస్టులకు రూ.1,50,000.

దరఖాస్తు ఫీజు: రూ.50; ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 21-11-2024.

వేదిక: సెంటర్ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ (సీ-మెట్), పంచవటి, పాశాన్ రోడ్‌ ఎదురుగా, పుణె.

Website:https://cmet.gov.in/jobs