అమెరికా న్యాయశాఖలో పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా భారతీయ అమెరికన్ హర్మీత్ థిల్లాన్ (54) నామినేట్ అయ్యారు.
ఆమె నియామకాన్ని ఖరారు చేస్తూ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ప్రకటన చేశారు.
చండీగఢ్‌లో జన్మించిన ఆమె తన చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు.
2016లో క్లీవ్‌లాండ్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో వేదిక ఎక్కిన తొలి భారతీయ అమెరికన్‌గా నిలిచారు.