Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 21, 2026
Current Affairs
సహ్‌యోగ్‌
సహ్‌యోగ్‌
  • ఆన్‌లైన్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలను, తప్పుడు సమాచార ప్రసారాన్ని నియంత్రించేందుకు కేంద్ర హోంశాఖ అందుబాటులోకి తెచ్చిన సహ్‌యోగ్‌ అస్త్రం మంచి ఫలితాలు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సైబర్‌ నేరాలను పర్యవేక్షించేందుకు కేంద్ర హోంశాఖ తరఫున నోడల్‌ ఏజెన్సీగా ఉన్న ఐ4సీ ఈ పోర్టల్‌ను రూపొందించింది.
  • 2024 అక్టోబరులో అందుబాటులోకి వచ్చిన ఈ పోర్టల్‌ మొదటి సంవత్సరంలో 19 ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం సంస్థలకు 2,312 బ్లాకింగ్‌ ఉత్తర్వులను జారీ చేసింది. అందులో చాలావరకు చట్టవ్యతిరేక పోస్టులు, లింకులు, ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ, నకిలీ సామాజిక మాధ్యమ ప్రొఫైళ్లు, ఫిషింగ్‌ వెబ్‌సైట్‌లు, నకిలీ యాప్‌లు తదితరాలకు సంబంధించినవి ఉన్నాయి.