Published on Jan 7, 2026
Current Affairs
సాహిత్య సంపుటాలు విడుదల
సాహిత్య సంపుటాలు విడుదల
  • దేశంలోని వివిధ ప్రాచీన భాష అధ్యయన పీఠాలు ప్రచురించిన సాహిత్య సంపుటాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 2026, జనవరి 6న దిల్లీలో విడుదల చేశారు. నెల్లూరులోని తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రం ప్రచురించిన ఎనిమిది గ్రంథాలు అందులో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే..
  • వైద్యం వెంకటేశ్వరాచార్యులు రచించిన ‘చిత్రకవిత్వ దర్పణం’, మొట్టమొదటి తెలుగు చందోగ్రంథం కవిజనాశ్రయంకు ప్రొఫెసర్‌ బి.వెంకటేశ్వర్లు తెలుగులో, ప్రొఫెసర్‌ ఆర్‌వీ సుందరం ఇంగ్లిష్‌లో రాసిన వ్యాఖ్యానాలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తమిళంలోకి అనువదించిన 15వ శతాబ్దానికి చెందిన క్రీడాభిరామం, డాక్టర్‌ గీతా నావల్‌ కన్నడంలోకి అనువదించిన అన్నమయ్య ‘సంకీర్తన లక్షణం’, డాక్టర్‌ రమేష్‌ రాసిన మల్లు పురాణం, రత్నావళి పరిణయం, డాక్టర్‌ టీఎస్‌ వెంకటేష్‌ రచించిన హరిచంద్రోపాఖ్యానాలను కేంద్రమంత్రి ఆవిష్కరించారు.