అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2024 అందుకున్నారు.
2025, మార్చి 8న సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ చేతులమీదుగా అవార్డు స్వీకరించారు.
లక్ష్మీనారాయణ రచించిన 36 ప్రగతిశీల వ్యాసాల సంకలనం ‘దీపిక’కు ఈ అవార్డు వరించింది.
సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమం, సాంస్కృతిక విధాన ఆవశ్యకత, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఆంధ్రప్రదేశ్ కవులు, రచయితల సంఘీభావంలాంటి సంక్లిష్ట వ్యాసాలు ‘దీపిక’లో ఉన్నాయి.
1974 నుంచి అభ్యుదయ రచయితల సంఘంతో కొనసాగుతూ.. ప్రస్తుతం దానికి అధ్యక్షుడిగా ఉన్నారు.