ప్రముఖ తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరికి 2024 సంవత్సరానికిగాను సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది.
గోపీనాథ్ మహంతి రచించిన ఒడియా నవల ‘దాది బుఢా’ను ‘ఈతచెట్టు దేవుడు’ పేరుతో తెలుగులోకి అనువదించినందుకు రాజేశ్వరికి పురస్కారం దక్కింది.
ఆమెతో పాటు వివిధ భాషల్లో గ్రంథానువాదం చేసిన మొత్తం 21 మందికి 2025, మార్చి 7న ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
పురస్కారం గెలుచుకున్న గ్రంథానువాదకులకు రూ.50 వేల నగదు బహుమతితోపాటు ఒక కాంస్య జ్ఞాపికను అందజేస్తారు.