Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 5, 2026
Current Affairs
సహకార క్లబ్‌లు
సహకార క్లబ్‌లు
  • తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో సహకార క్లబ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా విద్యావ్యవస్థకు సహకార సంఘాలను పరిచయం చేయనుంది. విద్యార్థులకు ఈ వేసవిలో అవగాహన తరగతులను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యోగులు, వినియోగదారులు, పట్టణ, గృహ నిర్మాణ, పారిశ్రామిక, చేనేత, మత్స్య, గీతకార్మిక తదితర విభాగాల్లో కలిపి 52 వేల వరకు సహకార సంఘాలు పని చేస్తున్నాయి.
  • అయితే, చాలామందికి కోఆపరేటివ్‌ సొసైటీల ప్రయోజనాలు, నియమనిబంధనలు, ప్రభుత్వ రాయితీలు తదితర అంశాలపై క్షుణ్నంగా తెలియడంలేదు. సరైన అవగాహన లేకపోవడంతో వాటి నిర్వహణలోనూ సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహకార వ్యవస్థపై విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కల్పిస్తే... భవిష్యత్తులో వారు సహకార సంఘాల ఏర్పాటు, నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తారని సహకార శాఖ భావిస్తోంది.