భూ తాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాల కట్టడి దిశగా పునరుత్పాదక, శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తోన్న దేశాల్లో భారత్ పదో అగ్రస్థానంలో నిలిచింది.
అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న వాతావరణ మార్పుల సదస్సు సందర్భంగా 2024, నవంబరు 20న 60కి పైగా దేశాలతో కూడిన ర్యాంకుల జాబితా విడుదలైంది.
వాతావరణ మార్పుల ఆచరణ సూచీ (సీసీపీఐ-2025) పేరుతో నిపుణులు దీన్ని రూపొందించారు.
ఈ జాబితాలో గత ఏడాది (2023) కంటే రెండు స్థానాల దిగువకు భారత్ చేరింది.
భారత్‌లో తలసరి ఉద్గారాల విడుదల 2.9 టన్నులుగా ఉంది. ప్రపంచ తలసరి ఉద్గారాల సగటు 6.6 టన్నులు కావడం గమనార్హం.