Published on Nov 20, 2024
Current Affairs
సీసీడీసీ నివేదిక
సీసీడీసీ నివేదిక

అల్ప, మధ్యాదాయ దేశాల్లో మూడు లేదా నాలుగేళ్ల వయసున్న సుమారు 18 కోట్ల మంది చిన్నారులకు సరైన పెంపకం లభించడం లేదని ఒక నివేదిక వెల్లడించింది. దిల్లీలోని సెంటర్‌ ఫర్‌ క్రానిక్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీసీడీసీ)కు చెందిన పరిశోధకులతో పాటు అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కూడిన బృందం ఈ అధ్యయనం చేసింది. 

అల్ప, మధ్యాదాయ దేశాల్లో ప్రతి చిన్నారినీ ఒక ఏడాది ముందుగా పాఠశాలలో చేర్పించడానికి ఆయా దేశాల జీడీపీలో 0.15 శాతం ఖర్చవుతుంది. ఈ విధానం ద్వారా వచ్చే లాభాలు ప్రభుత్వాలు వ్యయం చేసే ఖర్చుకన్నా 8 నుంచి 19 శాతం అధికంగా ఉంటాయి. 

భారత్‌లో పరిస్థితిని గమనిస్తే 2022లో 3 నుంచి 6 ఏళ్ల వయసున్న సుమారు దాదాపు 3 కోట్ల మంది చిన్నారులు ప్రీస్కూల్‌కు వెళ్లినట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.