హైదరాబాద్ హబ్సిగూడలోని సీఎస్ఐఆర్- సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) వివిధ పరిశోధన ప్రాజెక్టులలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయుటకు అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
వివరాలు:
1. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-I (నాన్-మెడికల్): 01
2. ప్రాజెక్ట్ అసోసియేట్-I: 04
అర్హత: పోస్టులను అనుసరించి బయోటెక్నాలజీలో పీజీ, లైఫ్ సైన్సెస్, వైల్డ్ లైఫ్ సైన్స్, అగ్రికల్చర్ లేదా బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ (55% మార్కులతో) కలిగి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్టంగా 35 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-I (నాన్-మెడికల్)కు రూ.56,000 + హెచ్ఆర్ఏ ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్-Iకు రూ.31,000 - రూ.37,000 వరకు ఉంటుంది.
ముఖ్య నిబంధనలు:
ఎంపిక విధానం: దరఖాస్తులను స్క్రీనింగ్ చేసిన అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ (ప్రత్యక్షంగా లేదా ఆన్‌లైన్) నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 23