హైదరాబాద్ హబ్సిగూడలోని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సీఎస్ఐఆర్- సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 80
వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: 25
2. టెక్నికల్ ఆఫీసర్: 05
3. టెక్నీషియన్(1)/గ్రేడ్-II(1): 50
అర్హత: టెక్నీషియన్ పోస్టులకు 50శాతం మార్కులతో సైన్స్ సబ్జెక్టుతో టెన్త్ లేదా తత్సమాన విద్యార్హత సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ లేదా నేషనల్/స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్, టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: టెక్నికల్ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు; టెక్నికల్ ఆఫీసర్‌కు 30 ఏళ్లు; టెక్నీషియన్‌కు 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: టెక్నికల్ అసిస్టెంట్‌కు 72,240; టెక్నికల్ ఆఫీసర్‌కు 90,100; టెక్నీషియన్‌కు రూ.39,545.
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష(పేపర్-I, II, III), మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి, తర్వాత హార్డ్‌కాపీలపై సంతకం చేసి సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి సెక్షన్ ఆఫీసర్, సీసీఎంబీ, ఉప్పల్ రోడ్, హబ్సీగూడ, హైదరాబాద్ చిరునామాకు మార్చి 3 వరకు పంపించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 23.02.2026.
హార్డ్‌కాపీ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 02.03.2026.