Published on Nov 12, 2025
Walkins
సీసీఆర్‌ఏఎస్‌లో కన్సల్టెంట్‌ ఉద్యోగాలు
సీసీఆర్‌ఏఎస్‌లో కన్సల్టెంట్‌ ఉద్యోగాలు

దిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ( సీసీఆర్‌ఏఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ (ఆయుర్వేదం) ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

కన్సల్టెంట్ (ఆయుర్వేదం) - 05

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఏ, ఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

వయోపరిమితి: 2025 నవంబరు 21వ తేదీ నాటికి 64 ఏళ్లు మించకూడదు. 

జీతం: నెలకు రూ.50,000. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025, నవంబర్‌ 21.

వేదిక: కౌన్సిల్ మొదటి అంతస్తులోని ఆయుష్ ఆడిటోరియం.

Website:https://ccras.nic.in/vacancies/