ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాతో పాటు యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ వేదికల్లో ప్రవర్తనపై మార్గదర్శకాలను రూపొందించింది. ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి ఉద్యోగులందరికీ ఇవి వర్తిస్తాయని స్పష్టంచేసింది. దీనికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే ఉద్దేశం లేదని, డిజిటల్ వేదికల్లో హుందాగా వ్యవహరించేలా చూడడమే తమ ఉద్దేశమని బిహార్ ప్రభుత్వం పేర్కొంది.