Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 23, 2026
Government Jobs
సశస్త్ర సీమాబల్‌లో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
సశస్త్ర సీమాబల్‌లో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు

భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన 'సశస్త్ర సీమా బల్' (ఎస్‌ఎస్‌బీ) గ్రూప్-'సి' నాన్-గెజిటెడ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, వెటర్నరీ, స్టీవార్డ్), పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 233

వివరాలు: 

1. హెడ్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్): 197 పోస్టులు

2. హెడ్ కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్): 29 పోస్టులు

3. హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ): 05 పోస్టులు

4. హెడ్ కానిస్టేబుల్ (స్టీవార్డ్): 02 పోస్టులు.

అర్హతలు: అభ్యర్థులు పోస్టును అనుసరించి పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ (సైన్స్/పీసీఎం) ఉత్తీర్ణులై ఉండాలి. ఎలక్ట్రీషియన్ పోస్టుకు ఐటీఐ (ITI), వెటర్నరీకి సంబంధిత డిప్లొమా, స్టీవార్డ్‌కు క్యాటరింగ్ డిప్లొమా/అనుభవం కలిగి ఉండటం తప్పనిసరి. 

వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి (ఎలక్ట్రీషియన్ పోస్టుకు 18-25 ఏళ్లు). ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 (+ఇతర అలవెన్సులు).

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (PET), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (PST), రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, డాక్యుమెంటేషన్, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

పరీక్ష ఫీజు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలకు రూ.100; ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్‌సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ప్రకటన 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20.04.2026.

Website:https://ssb.gov.in/recruitmentHome