భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన 'సశస్త్ర సీమా బల్' (ఎస్‌ఎస్‌బీ) గ్రూప్-'సి' నాన్-గెజిటెడ్ విభాగంలో వివిధ సబ్-ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్, పయనీర్, కమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 51
వివరాలు:
1. సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్): 10 పోస్టులు
2. సబ్ ఇన్స్పెక్టర్ (పయనీర్): 21 పోస్టులు.
3. సబ్ ఇన్స్పెక్టర్ (కమ్యూనికేషన్): 20 పోస్టులు.
అర్హతలు: స్టాఫ్ నర్స్‌కు 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీలో డిప్లొమా కలిగి ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. పయనీర్‌కు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
కమ్యూనికేషన్: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటి ఇంజినీరింగ్ లేదా సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌తో) బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి
గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
జీతం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 (+ఇతర అలవెన్సులు).
ఎంపిక విధానం: బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రాత పరీక్ష, డాక్యుమెంటేషన్, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
పరీక్ష ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.200; ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్‌సర్విస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 20.04.2026.