భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన 'సశస్త్ర సీమా బల్' (ఎస్‌ఎస్‌బీ) గ్రూప్-'సి' నాన్-గెజిటెడ్ విభాగంలో వివిధ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 76
వివరాలు:
1. హెడ్ కానిస్టేబుల్ (ల్యాబొరేటరీ అసిస్టెంట్): 30 పోస్టులు
2. హెడ్ కానిస్టేబుల్ (ఫిజియోథెరపీ అసిస్టెంట్): 12 పోస్టులు.
3. కానిస్టేబుల్ (నర్స్ అసిస్టెంట్ కమ్ మెడిక్): 34 పోస్టులు.
అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ సబ్జెక్టులతో 10+2 (ఇంటర్మీడియట్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో (ల్యాబ్/ఫిజియోథెరపీ) డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సుతో పాటు ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. కానిస్టేబుల్ (నర్స్ అసిస్టెంట్) పోస్టుకు టెన్త్ ఉత్తీర్ణతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్, సంబంధిత అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మాజీ సైనికులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు హెడ్ కానిస్టేబుల్‌కు రూ.25,500- రూ.81,100; కానిస్టేబుల్‌కు రూ.21,700- రూ.69,100 (+ఇతర అలవెన్సులు).
ఎంపిక విధానం: బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రాత పరీక్ష, డాక్యుమెంటేషన్, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
పరీక్ష ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100; ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్‌సర్విస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 20.04.2026.