Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 23, 2026
Government Jobs
సశస్త్ర సీమాబల్‌లో కానిస్టేబుల్ (నాన్-జీడి) పోస్టులు
సశస్త్ర సీమాబల్‌లో కానిస్టేబుల్ (నాన్-జీడి) పోస్టులు

భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన 'సశస్త్ర సీమా బల్' (ఎస్‌ఎస్‌బీ) గ్రూప్-'సి' నాన్-గెజిటెడ్ విభాగంలో వివిధ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 827

వివరాలు:

కానిస్టేబుల్ (డ్రైవర్ - పురుషులు): 553

కానిస్టేబుల్ (వెటర్నరీ): 34

కానిస్టేబుల్ (వాషర్‌మెన్): 74

కానిస్టేబుల్ (బార్బర్): 43

కానిస్టేబుల్ (గార్డెనర్): 41

కానిస్టేబుల్ (టైలర్): 41

కానిస్టేబుల్ (కోబ్లర్/షూ మేకర్): 25

కానిస్టేబుల్ (కార్పెంటర్): 07

కానిస్టేబుల్ (వాటర్ క్యారియర్): 05

కానిస్టేబుల్ (వెయిటర్): 03

కానిస్టేబుల్ (నర్సింగ్ ఆర్డర్లీ): 01

అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్స్‌ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వెటర్నరీ, నర్సింగ్ ఇతర ట్రేడ్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం లేదా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.

వయోపరిమితి: డ్రైవర్, వెటర్నరీ, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు; కార్పెంటర్: 18 - 25 ఏళ్లు; ఇతర పోస్టులకు 18 - 23 ఏళ్లు. (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది).

జీతం: నెలకు రూ.21,700- రూ.69,100.

ఎంపిక విధానం: పీఈటీ/పీఎస్‌టీ, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్యపరీక్షలు తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

పరీక్ష ఫీజు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలకు రూ.100; ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్‌సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 20.04.2026.

Website:https://ssb.gov.in/recruitmentHome